'ఒంగోలు గిత్త' సినిమా స్టోరీ
posted on Feb 1, 2013 2:49PM
‘ఆరెంజ్’ దెబ్బకు దిమ్మతిరిగిన డైరెక్టర్ భాస్కర్ ఇక కెరీర్లో ‘కొత్తదనం’ జోలికేల్లకూడదని అనుకున్నాడేమో కాని, ఇప్పటిదాకా ప్రతి సినిమాలోనూ ఎంతో కొంత కొత్తదనం చూపిస్తూ, సున్నితమైన ప్రేమకథలు తీసిన భాస్కర్.. ఆ బాటను పూర్తిగా వదిలేసి ‘మాస్ ఎంటర్టైనర్’ "ఒంగోలు గిత్త" పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా స్టోరీ మీ కోసం.
ఒంగోలు గిత్త మిర్చ్ యార్డ్ నేపధ్యంలో సాగే కథ. వైట్ (హీరో రామ్) చిన్నపాటి నుంచి మిర్చి యార్డ్ లో పెరిగి ఆదికేశవ నాయుడు కి కుడి భుజంలా ఎదుగుతాడు. సంధ్య( క్రితిఖర్బంధ) ఆదికేశవనాయుడి కూతురు. వైట్ సంధ్యతో లవ్ లో పడతాడు. ఆమెని పెళ్ళిచేసుకుంటానని ఆదికేశవనాయుడిని అడుగుతాడు.
ఇంతలో లోకల్ ఎమ్మెల్యే అయినా ఆహుతిప్రసాద్ తన సొంత లాభం కోసం మిర్చి యార్డ్ ని వేరే ప్రాంతానికి మార్చాలని అనుకుంటాడు. అయితే మిర్చి యార్డ్ ని నమ్ముకుని వున్నవాళ్ళు తమకు ఎలాగైనా సహయం చేయమని వైట్, ఆదికేశవనాయుడి ని అడుగుతారు. సడన్ గా మూవీలో ట్విస్ట్ జరుగుతుంది. మిర్చి యార్డ్ పాత చైర్మన్ నారాయణ(ప్రభు) తో వైట్ కి ఆదికేశవనాయుడి కి సంబంధం ఉంటుంది. ఇంతకి గతం ఏమిటి? వైట్ కి ఆదికేశవనాయుడి కి నారాయణ్ తో వున్న సంబంధం ఏమిటి? అనేది మిగతా స్టోరీ.